పతుల గెలుపుకోసం సతుల ప్రచారం

May 3,2024 12:43 #pracharam

ప్రజాశక్తి -కాళ్ళ
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు ప్రతి అభ్యర్థికి ప్రతిష్టాత్మకంగా మారటంతో తమ భర్తల విజయం కోసం భార్యలు ప్రచారాన్ని చేస్తున్నారు. గతకొన్ని రోజులుగా వీరు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. నరసాపురం ఎంపీ, ఉండి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణంరాజు సతీమణి రమాదేవి, ఆయన కుమార్తె ఇందిరా ప్రియదర్శిని, కుమారుడు భరత్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాగ్‌ పార్టీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు( కలవపూడి శివ) సతీమణి అరుణ, కుమార్తెలు శృతి శ్రావ్య, కుమారుడు అభి రామ్‌ వర్మ లు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార నిర్వహిస్తున్నారు.పాలకొల్లు నియోజకవర్గంలో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ నిమ్మల రామానాయుడు సతీమణి సూర్య కుమారి ఎన్నికల ప్రచార నిర్వహిస్తున్నారు. నరసాపురం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బమ్మిడి నాయకర్‌ సతీమణి సునీత, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు సతీమణి శారదా దేవిలు ఎన్నికల ప్రచారం ముమ్మురంగా నిర్వహిస్తున్నారు. ఆచంట టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణ సతీమణి అనంతలక్ష్మి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల సతీమణులతో పాటు వారి సోదరులు, సోదరీమణులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

➡️