నేడు సీఎం జగన్‌ ప్రచార సభల షెడ్యూల్‌

May 1,2024 07:09 #ap cm jagan, #sedule

అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆయన విడుదల చేశారు.
వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్‌ సెంటర్‌లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

➡️