షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్‌లో సోదాలు

ప్రజాశక్తి – కడప ప్రతినిధి :కడప ఇండిస్టియల్‌ ఎస్టేట్‌లోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ కంపెనీలో సోదాల అంశం కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ యూనిట్‌-2 విభాగంలో ఐటి, స్టేట్‌ ట్యాక్స్‌, ఎన్నికల అబ్జర్వర్లు ఏడు బృందాలుగా ఏర్పడి పోలీసుల సహాయంతో రెండు గంటల పాటు తనిఖీలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బులు నిల్వ చేశారనే కోణంలో తనిఖీలు చేపట్టారు. ఎటువంటి ఆధారాలను సేకరించాయనే వివరాలను తనిఖీ బృందాలు వెల్లడించలేదు.

➡️