జగన్‌కు భద్రత కుదింపు

Jun 17,2024 23:25 #house, #jagan, #Security

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైసిపి అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఆయన నివాసానికి భద్రతను కుదించారు. జగన్‌ సిఎంగా వున్నప్పుడు అడిషనల్‌ ఎస్‌పి స్థాయి అధికారి నేతృత్వంలో జడ్‌ప్లస్‌ కేటగిరి కింద మొత్తం 120 మంది పోలీసుల రక్షణ వుండేది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసిపి ఓటమిపాలవడంతో జగన్‌కు భద్రతను కుదించారు. ప్రస్తుతం డిఎస్‌పి స్థాయి అధికారి నేతృత్వంలో 57 మంది పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. దీంతో జగన్‌ సోమవారం నుంచి 30 మంది ప్రైవేటు సెక్యూరిటీని తన ఇంటి వద్ద రక్షణగా పెట్టుకున్నారు. గతంలో సీతానగరం నుంచి రేవేంద్రపాడు వరకు వున్న ఈ రోడ్డును జగన్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక కరకట్ట వెంట దాదాపు కిలోమీటరు వరకు వున్న అమరారెడ్డి నగర్‌లో ఫోర్‌లైన్‌ రోడ్డు వేయించి ప్రజల రాకపోకలపై నియంత్రణ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు రాకపోకలు సాగించేలా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

➡️