అనుచిత వ్యాఖ్యల కేసులో ప్రతివాదులుగా పలు మీడియా సంస్థలు

Feb 14,2024 11:25 #Case, #defendants, #Media, #Several

ప్రజాశక్తి-అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబును కోర్టు రిమాండ్‌కు పంపిస్తూ ఎసిబి కోర్టు ఉత్తర్వులు జారీతోపాటు ఆ కేసును కొట్టేయాలనే పిటిషన్‌ డిస్మిస్‌ కావడంతో అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో టివి-5, మహాన్యూస్‌, మైరా మీడియా సంస్థలను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. హైకోర్టు న్యాయమూర్తులు, ఎసిబి కోర్టు న్యాయాధికారిపై యూట్యూబ్‌లోని అభ్యంతరకర పోస్టులను తొలగించాలని గూగుల్‌ ఎల్‌ఎల్‌సిని మంగళవారం ఆదేశించింది. ఇప్పటికే అలాంటి పోస్టులను తొలగించినట్లు ఎక్స్‌, ఫేస్‌బుక్‌ హైకోర్టుకు నివేదించాయి. పలువురికి నోటీసులు అందాల్సి వుందని, ఇందుకు గడువు కావాలని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోరారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు విచారణను మార్చి 26కు వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయితో కూడిన ధర్మాసనం ప్రకటించింది.

➡️