తండ్రి కలలను నిజం చేసేందుకే కాంగ్రెస్‌లోకి షర్మిల: షేక్‌ మస్తాన్‌ వలీ

Jan 7,2024 14:57 #congress leader, #press meet

గుంటూరు: వైఎస్‌ షర్మిలను విమర్శించే అర్హత వైసిపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలీ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో షర్మిల చేరడంతో వైసిపి నేతలకు భయం పట్టుకుందని ఆరోపించారు. గుంటూరులో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.”వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కుటుంబమంతా కాంగ్రెస్‌కు సేవలందించింది. ఒక్క జగన్‌ మాత్రమే ఆ పార్టీని వీడారు. ఇందిరమ్మ ఆశయ సాధనకు రాజశేఖర్‌ రెడ్డి కఅషి చేశారు. తండ్రి కలలను నిజం చేసేందుకే షర్మిల కాంగ్రెస్‌లోకి వచ్చారు. వైసిపి వైఖరి నచ్చకే పార్టీకి ఆమె దూరమయ్యారు. రాజశేఖర్‌ రెడ్డి మరణంపై అనుమానాలు ఉంటే సజ్జల ఈ ఐదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు? ఆయన మఅతిపై విచారణకు ఎందుకు డిమాండ్‌ చేయలేదు? కేవలం రాజకీయాల కోసమే వైఎస్‌ మృతిని మళ్లీ తెరపైకి తెచ్చారు. వివేకా హత్య కేసు నిందితులను ఎందుకు పట్టుకోలేదు? ప్రధాని మోడీకి సీఎం జగన్‌ పూర్తిగా లొంగిపోయారు. రాష్ట్రాన్ని ఆయన వద్ద తాకట్టుపెట్టారు” అని విమర్శించారు.

➡️