సోనియా, రాహుల్‌ను కలిసిన షర్మిల

Jun 18,2024 08:27 #meets, #Sharmila, #Sonia and Rahul
  • రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీని ఎపిసిసి అధ్యక్షులు షర్మిల కలిశారు. సోమవారం నాడిక్కడ సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్‌ తదుపరి కార్యాచరణకు సంబంధించి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భవిష్యత్‌ ప్రణాళికలు, తదుపరి కార్యాచరణ, వీటన్నింటిపై ఎంతో నిర్మాణాత్మకమైన చర్చ జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ తిరిగి పున్ణ వైభవం సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఒక బలమైన శక్తిగా అవతరించడంలో మరిన్ని అడుగులు పడనున్నాయని తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నానని షర్మిల అన్నారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై తీసుకునే నిర్ణయాలపై చర్చించినట్లు తెలిపారు.

➡️