నేడు పులివెందులలో షర్మిల ప్రచారం..

ప్రజాశక్తి-కడప : ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నేడు వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. మాజీమంత్రి వైఎస్‌ వివేకా కుమార్తె సునీతతో కలిసి రోడ్‌షోలు, సభల్లో పాల్గొంటారు. ఈ రోడ్‌షో లింగాల, సింహాద్రిపురంలో పర్యటన అనంతరం సాయంత్రం ఆరున్నర గంటలకు పులివెందుల చేరుకుంటారు. అక్కడ రోడ్‌షో అనంతరం సభలో ప్రసంగిస్తారు. రేపు జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో పర్యటిస్తారు. దీంతో ఈ విడత బస్సుయాత్ర ముగుస్తుంది.

➡️