పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్‌ లత్కర్‌

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్‌గా శ్రీకేష్‌ లత్కర్‌ బాలాజీరావు నియమితులయ్యారు. ఆయన 2011 ఐఎఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన మున్సిపల్‌ పరిపాలనా శాఖ డైరెక్టర్‌గా ఉన్నారు. గతంలో శ్రీకాకుళం కలెక్టర్‌గా పనిచేశారు. పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్ల నేపధ్యంలో జిల్లా కలెక్టర్‌ ఎల్‌. శివశంకర్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో శ్రీకేష్‌ లత్కర్‌ను నియమిస్తూ ఎన్నికల కమిషన్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

➡️