12వ రోజు ‘సమగ్ర శిక్ష’ ఉద్యోగుల సమ్మె

ssa contract and out sourcing employees

 

ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఆదివారం నాటికి 12వ రోజుకి చేరుకుంది. సమ్మె సందర్భంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి సమగ్ర శిక్ష జె ఏ సి జిల్లా అధ్యక్షులు అధ్యక్షులు గురువులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ నీ అమలుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతుంటే సమస్యలు పరిష్కారంచేయకుండా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. శనివారం మంత్రి తో జరిగిన చర్చల్లో సమస్యలు పరిష్కారం కోసం ఎటువంటి స్పష్టమైన హామీ ఇవ్వకుండా సమ్మెను విరమించమని కోరడం సరికాదని అన్నారు. జీతాలు లేక, రెగ్యులర్ చేస్తామని చెప్పిన హామీని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బెదిరింపులకు భయపడేది లేదని సమస్యలు పరిష్కారం చేసే వరకు సమ్మె విరమించేది లేదన్నారు. 12రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కోసం ముందుకు రాకపోవడం చాలా దారుణమన్నారు. జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నమన్నారు. సమగ్ర శిక్షా అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేసి, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు. వేతనంతో కూడిన మెడికల్ లీవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

➡️