9 నుంచి కులగణన ప్రారంభం-మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరోరాష్ట్రంలో కులగణన ప్రక్రియ డిసెంబరు తొమ్మిది నుంచి ప్రారంభమవుతుందని బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత కల్పిస్తుందని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదన్నారు. ప్రజల జీవనస్థితి మారడానికి కులగణన అవసరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తించారని అన్నారు. కులగణన చేపట్టేందుకు రాష్ట్రంలోని అన్ని కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, ఇందుకోసం అధికారుల నేతృత్వంలో ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బిసిలను చంద్రబాబు కేవలం ఓట్లకు పనికొచ్చే యంత్రాలుగా చూశారన్నారు. వలంటీర్ల వ్యవస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే నిర్దిష్టత వుండదని టిడిపి మాట్లాడటం తగదని అన్నారు.

➡️