పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే : చంద్రబాబు

Jan 23,2024 11:16 #Chandrababu Naidu
  • టిడిపి ఆద్వర్యంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి

ప్రజాశక్తి-అమరావతి : నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా టిడిపి అధినేత, నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోరాటం అనేది లేకపోతే సగం జీవితాన్ని కోల్పోయినట్లే అని నేతాజీ అన్నారని పేర్కొన్నారు. కనుక మహానుభావుడైన ఆ నేతాజీ మాటలనే స్ఫూర్తిదాయకంగా తీసుకుని అరాచక శక్తులపై పోరాడదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక నేతాజీ జయంతిని దేశం శౌర్యదినోత్సవంగా జరుపుకుంటుందని .. అలాంటి మోహోన్నతమైన ఈ రోజు ఆ దేశభక్తుని సేవలు స్మరించుకుందామని పేర్కొంటూ ఎక్స్‌’ (ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు.

➡️