గుండెపోటుతో ఓయూలో విద్యార్థి మృతి

Jan 20,2024 12:22 #death, #hyderabad

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీలో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. చిరంజీవి అనే విద్యార్థి ఓయూ కామర్స్‌లో ఎంకామ్‌ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ఓయూ హాస్టల్‌లో ఉంటూ ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈ క్రమంలో చిరంజీవి గుండెపోటుతో బాధపడటాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిరంజీవి చనిపోయినట్టు గాంధీ వైద్యులు నిర్దారించారు.

➡️