24 నుంచి వేసవి సెలవులు

– జూన్‌ 12న పాఠశాలలు పున:ప్రారంభం
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఈ నెల 24 నుంచి జూన్‌ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలు తిరిగి జూన్‌ 12న పున:ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే పాఠశాలల్లో వాటర్‌బెల్‌ కార్యక్రమం అమలు చేయాలని సురేష్‌కుమార్‌ అన్నారు. ఈ మేరకు డిఇఒలకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు డీ హైడ్రేషన్‌కు గురికాకుండా రోజుకు మూడుసార్లు (ఉదయం 8:45, 10:05, 11:50 గంటలకు) వాటర్‌ బెల్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పకుండా నీరు తాగేలా ప్రధానోపాధ్యాయులు సూచించాలని పేర్కొన్నారు.
పాఠశాలల్లో విద్యార్థులకు లంచ్‌ బ్రేక్‌ ఇచ్చినట్లు ఐదు నిమిషాలపాటు వాటర్‌ బ్రేక్‌ ఇచ్చే విధానాన్ని దేశంలోనే తొలిసారిగా కేరళలోని కొన్ని బడుల్లో 2019లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. మంచి స్పందన రావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు.

➡️