తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారు: బీవీ రాఘవులు

హైదరాబాద్‌: సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేగంగా కోలుకుంటున్నారని ఆ పార్టీ పొలిటికల్‌ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు తెలిపారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమ్మినేనిని ఆయన బుధవారం పరామర్శించారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ..అనారోగ్యం కారణంగా తమ్మినేని వీరభద్రం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. ఇప్పుడే ఆయనను ఆస్పత్రిలో పరామర్శించి వచ్చానని వెల్లడించారు. తాను డాక్టర్లతోనూ మాట్లాడి..తమ్మినేని ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాను. ఆయన ఆరోగ్య పరిస్థితి వేగంగా మెరుగుపడుతోందన్నారు. హృద్రోగ సంబంధ సమస్యలతో ఆయన ఆసుపత్రిలో చేరారన్నారు. నిపుణులైన డాక్టర్లు ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని వైద్యులు చెప్పారన్నారు. ఆయన త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

➡️