తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం త్వరగా కోలుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. వీరభద్రం అనారోగ్యానికి లోనయ్యారని తెలిసి బాధపడ్డానని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ్మినేనితో కొన్ని సందర్భాల్లో కలిసి చర్చించానని, తెలంగాణ ప్రాంత సమస్యలు, పేదలు, శ్రామికుల కష్టాలు బాగా తెలిసిన వ్యక్తి అని వెల్లడించారు. వారి కోసం నిలబడతారని పేర్కొన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజా జీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు.

➡️