టిడిపి-జనసేన తొలి జాబితా – ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ

అమరావతి : టిడిపి-జనసేన కూటమి అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్న వేళ … ఇరు పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. తెలుగుదేశం, జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా శనివారం విడుదల కానున్న నేపథ్యంలో …. టిడిపి ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, యనమల రామకఅష్ణుడు, నక్కా ఆనంద్‌బాబు, గొట్టిపాటి రవి, అనగానితో సమావేశమయ్యారు. జాబితాలో ఎవరెవరి పేర్లు ఉంటాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.

➡️