కూల్చివేత సంస్కృతి మార్చుకోరా? : టిడిపి అధినేత చంద్రబాబు

Apr 22,2024 22:55 #chandrababu, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూల్చివేత సంస్కృతిని మార్చుకోరా? అని వైసిపిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇళ్లను నిర్మించి ఇవ్వడం చేతకాని ప్రభుత్వానికి కూల్చే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. తమ హయాంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఐదేళ్లయినా వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారని విమర్శించారు. గుంటూరుకు చెందిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షులు కోపూరి లక్ష్మి తన వేలిని కోసుకున్నారన్న వార్త తనను కలచివేసిందని మరో ప్రకటనలో తెలిపారు. తను నివసించే ప్రాంతంలోని అక్రమాల గురించి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదన్నారు. నిర్వేదంతో, నిస్పృహతో ఇలాంటి ఘటనలకు పాల్పడొద్దని కోరారు.

➡️