పల్లా నియామకంపై టిడిపి ఉత్తర్వులు

Jun 16,2024 22:57 #Palla's appointment, #TDP orders

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి రాష్ట్ర అధ్యక్షులుగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్‌ను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. విశాఖపట్నం పార్లమెంటు అధ్యక్షునిగా సమర్ధవంతంగా పనిచేసిన శ్రీనివాసరావు నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పటివరకు పార్టీని నడిపించడంలో అద్భుత పనితీరు కనబరిచిన సీనియర్‌ నేత, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు అభినందనలు తెలిపారు. ప్రతిపక్షంలో అనేక సమస్యలు, సవాళ్లను ఎదుర్కొని పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని అచ్చెన్నను చంద్రబాబు ప్రశంసించారు.

➡️