నేడు టిడిపి రెండో జాబితా..  25 అసెంబ్లీ, 8 ఎంపిలతో ప్రకటన!

Mar 14,2024 06:50 #2024 elections, #announced, #candidate, #TDP
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్న గుండ లక్ష్మీదేవి సైతం టిక్కెట్‌ కోసం వేచి చూడాల్సిన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : టిడిపి అభ్యర్థుల రెండో జాబితా గురువారం విడుదల కానుంది. ప్రకటించే స్థానాలపై పార్టీ అధినేత చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు. పొత్తులో భాగంగా జనసేన-బిజెపితో సంబంధం లేని స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా టిడిపి 144 స్థానాల్లో పోటీ చేయనుంది. ఇందులో ఇప్పటికే 94 స్థానాలకు జనసేనతో కలిసి తొలి జాబితా విడుదల చేశారు. మరో 50 స్థానాల్లో టిడిపి తన అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అదే విధంగా 17 లోక్‌సభ స్థానాల్లోనూ అభ్యర్థులను వెల్లడించాల్సి ఉంది. రెండో జాబితాలో 25 శాసనసభ, 8 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించనున్నట్లు సమచారాం. శాసనసభ జాబితాలో తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి అభ్యర్థిగా బొజ్జల సుధీర్‌రెడ్డిని, నెల్లూరు జిల్లా కొవ్వూరుకు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, రాజమండ్రి రూరల్‌ అభ్యర్థిగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దెందులూరు చింతమనేని ప్రభాకర్‌ పేర్లను ప్రకటించే అవకాశం ఉంది. వీటితోపాటు మైలవరం, పెనమలూరు, సర్వేపల్లి, గుంతకల్లు, పెదకూరపాడు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, కర్నూలు, విశాఖపట్నం, చిత్తూరు స్థానాలను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

➡️