గందరగోళం సృష్టించడమే టిడిపి పని : నారాయణస్వామి

Feb 8,2024 08:45 #YCP Leaders
tdps-job-is-to-create-confusion-narayanaswamy

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అసెంబ్లీలో గందరగోళం సృష్టించడమే టిడిపి సభ్యులు పనిగా పెట్టుకున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆరోపించారు. సభను సజావుగా జరగకుండా అడ్డుకునేందుకు టిడిపి సభ్యులు సభకు హాజరవుతున్నారన్నారు. గతంలో చంద్రబాబు పాలన ఎలా ఉందో.. ఇప్పుడు తమ ప్రభుత్వ పాలన ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. బుధ వారం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లా డుతూ.. పేద ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని చూసి టిడిపి ఓర్వలేకపోతోం దన్నారు. భూ కబ్జాదారులు, పెత్తందారులను అధికారంలోకి తీసుకురావాలనేదే ప్రతిపక్షం కోరిక అని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌ నిధుల్లో బినామీల పేరుతో అవినీతి జరిగిందన్నారు. ఇప్పుడు అనేక మందికి ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు సంక్షేమ లబ్ధి నేరుగా అందుతోందన్నారు. టిడిపి సభ్యుల బాధ్యతారాహిత్యం మంత్రి చెల్లుబోయినఅసెంబ్లీలో టిడిపి సభ్యులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని, మీడియాలో కనిపించాలని అసెంబ్లీలో అల్లరి చేస్తున్నారని సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. స్పీకరు పోడియంపైకి దూసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు. తమ పాలనలో రైతులకు ఇన్సూరెన్స్‌, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వని టిడిపి అసెంబ్లీలో వాటిపై ప్రశ్నించడం శోచనీయమన్నారు.

జగన్‌తోనే ప్రయాణం : ఎంఎస్‌ బాబు

కాంగ్రెస్‌లోకి తాను వెళుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్‌ బాబు అన్నారు. జగన్‌తోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు.

జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి : మద్దాల గిరి

జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాల గిరి అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం లోటులోనే ఉందన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందడం వల్లే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించగలిగారన్నారు.

➡️