విజయవాడ బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఉద్రిక్తత

Dec 25,2023 13:50 #Benz Circle, #tension, #Vijayawada

విజయవాడ : విజయవాడ బెంజిసర్కిల్‌ వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంజ్‌ సర్కిల్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ మంత్రి కాకాని వెంకటర్నతం వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘జై భారత్‌’ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కాకాని విగ్రహానికి నివాళులర్పిస్తున్న సమయంలో మాజీ ఎమెల్యే యలమంచిలి రవి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకాని కుమారుడు తరుణ్‌కు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి అనుచరులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంకటరత్నం వారసుడు తరుణ్‌ కాదంటూ రవి అనుచరులు నినాదాలు చేశారు. ఓ సమయంలో ఆయనపైకి దూసుకొచ్చారు. బెంజ్‌ సర్కిల్‌లోని కాకాని విగ్రహం తొలగిస్తున్నప్పుడు పోరాడిన వాళ్ళని పక్కనపెట్టి, రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు విగ్రహం పెట్టారంటూ … రవి అనుచరుల తరుణ్‌ పై ధ్వజమెత్తారు. దీంతో తరుణ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

➡️