గుడివాడలో టెన్షన్‌.. టెన్షన్‌..

Jan 18,2024 12:29
  • పోలీసులకు టిడిపి-జనసేన నేతల వాగ్వాదం

ప్రజాశక్తి-గుడివాడ: ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా గురువారం టిడిపి, వైసిపి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గురువారం గుడివాడలో టిడిపి రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలోనూ ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమం జరగనున్నది. పోటాపోటీగా ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్దకు వెళ్తున్న టిడిపి-జనసేన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులతో టిడిపి-జనసేన కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. గుడివాడ టిడిపి ఇన్‌ఛార్జ్‌ వెనిగండ్ల రాము ఇతర నాయకులు బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లారు.

➡️