Tension – విజయనగరంలో మిమ్స్‌ ఉద్యోగుల ఆందోళన .. అరెస్టులు

విజయనగరం : తమ సమస్యలు పరిషరించాలని డిమాండ్‌ చేస్తూ …. మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో మిమ్స్‌ ఉద్యోగులు విజయనగరం ఆర్‌టిసి కాంప్లెక్స్‌ రోడ్డుపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు. ఎన్‌ఎంసి ని మోసగిస్తూ, ప్రజలకు వైద్యం లేకుండా, వైద్య విద్యార్థులకు చదువు లేకుండా చేస్తున్న మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మండుటెండలో రోడ్డుపై బైఠాయించిన నిరసనకారులను పోలీసులు అడ్డగించడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు బలవంతపు అరెస్టులు చేశారు. ఆందోళనకారులను పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. జీపుల్లో నిరసనకారులను కుక్కి తరలించడంతో… అప్పటికే ఎండలో నిరసన చేసిన కొందరు సొమ్మసిల్లిపడిపోయారు. కొందరు మహిళలు పోలీస్‌ స్టేషన్లకు వెళ్లిన వెంటనే సోలిపోయారు.

 

 

సొమ్మసిల్లి పడిపోయిన మహిళలు
సొమ్మసిల్లి పడిపోయిన మహిళలు

➡️