రేపటి నుంచి టెన్త్‌, ఇంటర్‌ సప్లమెంటరీ పరీక్షలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్‌ 3వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,61,877 మంది విద్యార్ధులు హాజరు కానున్నారు. మొత్తం 685 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 1వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్‌ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,03,459 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్ధులు 3,65,872 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం విద్యార్ధులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు ఇంటర్మీడియట్‌ బోర్డు నిర్వహించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 861 పరీక్ష కేంద్రాలను బోర్డు ఏర్పాటు చేసింది.

➡️