మతోన్మాద ఎన్‌డిఎ కూటమిని ఓడించాలి

May 7,2024 13:31 #cpm
  • నేటి నుంచి మూడురోజులపాటు రాష్ట్రంలో సీతారామ్‌ ఏచూరి ప్రచారం
    విజయవాడ : కేంద్రంలోని మతోన్మాద బిజెపి, దానికి అంటకాగే పార్టీలను ఓడించాలనీ, లౌకికవాదాన్ని బలపర్చే ఇండియా బ్లాక్‌ కూటమిని గెలిపించాలని కోరుతూ సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి రాష్ట్రంలో మూడురోజులపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గనబోతున్నారు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు కూడా ఈ సమావేశాల్లో పాల్గనబోతున్నారు. దేశంలో బిజెపిని ఓడించటం, రాజ్యాంగాన్ని, ప్రజలను రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాజ్యాంగాన్ని రద్దుచేసే బిజెపితో భాగస్వామ్య పార్టీలైన టిడిపి, జనసేనలను, మద్దతు ఇస్తున్న వైసిపిని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలవరంలో మునిగిపోతూ నేటికీ పునరావాసం దొరకని రైతులు, ప్రజానీకం, అడవి నుంచి గెంటేయబడుతున్న ఆదివాసులు, రక్షణ కోల్పోతున్న మైనార్టీలు తీవ్ర అభద్రతా భావంలో ఉన్న విషయం తెలిసిందే. నిరంతరం నిబద్ధతతో వారి కోసం పనిచేసే పోరాడే సిపిఎం, సిపిఐ, ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డుషోలు, బహిరంగ సభలకు పార్టీలతో సంబంధం లేకుండా వేలాదిగా ప్రజలు కదలిరావాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు.బుధవారం ఉదయం 9.30 గంటలకు కృష్ణాజిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం పామర్తినగర్లోని ఎస్‌విఆర్‌ ఫంక్షన్‌ హాలులో ఇండియా వేదిక బలపరచిన సిపిఎం అభ్యర్థి కళ్లం వెంకటేశ్వరరావు, వేదిక అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించనున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం సాయంత్రం 4 గంటలకు పాత అప్సర హాలు స్థలంలో కాకుండా వేదిక, సమయంలో మార్పు చేశారు. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, రాష్ట్ర, జిల్లా నాయకులు ఈ సభలో మాట్లాడనున్నారు. ఇండియా బ్లాక్‌ బలపర్చిన సిపిఎం గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కళ్ళం వెంకటేశ్వరరావు, ఇండియా బ్లాక్‌ బలపర్చిన బందరు పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గొల్లు కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ వీరంతా ప్రసంగిస్తారు. అదేరోజు సాయంత్రం అదేరోజు సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి కృష్ణుడు గుడి సెంటరులో జరిగే బహిరంగ సభలో సీతారామ్‌ ఏచూరి ప్రసంగిస్తారు. కాంగ్రెస్‌, సిపిఐ, ఆప్‌, వామపక్ష ప్రజాతంత్ర శక్తులు, ఇండియా బ్లాక్‌ పార్టీలు బలపర్చిన మంగళగిరి నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి జన్నా శివశంకరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఈ బహిరంగ సభను ఏర్పాటుచేశారు. ఈ సభలో సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి, సిపిఎం సీనియర్‌ నాయకులు పి.మధు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, సిపిఎం మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు, , సిపిఐ గుంటూరు లోక్‌సభ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.కృష్ణయ్య, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు తదితరులు ప్రసంగిస్తారు.గురువారం కూనవరం మండలం కేంద్రంలోని పోలీస్‌గ్రౌండ్స్‌లో ఇండియా కూటమి బహిరంగ సభను ఏర్పాటుచేశారు. ఇప్పటికే గత కొద్దిరోజులుగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ పెద్దఎత్తున కరపత్రాలను పంపిణీచేశారు. వాల్‌పోస్టర్లు అంటించారు. ఆయా పార్టీల నాయకులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఇండియా బ్లాక్‌ కూటమి బలపర్చిన సిపిఎం రంపచోడవరం అసెంబ్లీ అభ్యర్థి లోతా రామారావు, అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి పాచిపెంట అప్పలనర్సను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులు ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కూనవరంలో జరిగే బహిరంగ సభలో సిపిఎం అఖిల భారత కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, తెలంగాణా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణా సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు పూనంనేని సాంబశివరావు, రెండు రాష్ట్రాల ముఖ్యనాయకులు పాల్గంటారు.10న విజయవాడలో ఇండియా వేదిక సభహాజరు కానున్న జాతీయ నేతలుఇండియా వేదిక పార్టీలైన సిపిఎం, కాంగ్రెస్‌, సిపిఐ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఈ నెల 10వ తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ఏర్పాట్లను ఎఐసిసి కార్యదర్శి హెయప్పన్‌, సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్‌, ఆమ్‌ ఆద్మీ నాయకులు పరమేశ్వరరావు పర్యవేక్షిస్తున్నారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో ఇండియా వేదిక అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి చిగురుపాటి బాబూరావు (సిపిఎం), పశ్చిమ నుంచి జి.కోటేశ్వరరావు (సిపిఐ), తూర్పు నియోజకవర్గం నుంచి పి.నాంచారయ్య (కాంగ్రెస్‌), విజయవాడ పార్లమెంట్‌కు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా వల్లూరు భార్గవ్‌ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వీరి విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు విజయవాడ జింఖానా గ్రౌండ్లో జరిగే సభలో ఎఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి, సిపిఐ ఆలిండియా కార్యదర్శి డి.రాజా, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి మాణిక్‌ ఠాకూర్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌, ఆమ్‌ ఆద్మీ రాష్ట్ర కార్యదర్శి శీరా రమేష్‌ పాల్గంటున్నారు. విజయవాడ నగరంలోని సెంట్రల్‌, తూర్పు, పశ్చిమ మూడు నియోజకవర్గాల పరిధిలోని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, లౌకికశక్తులు, రాజ్యాంగ పరిరక్షణా కమిటీ నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గనబోతున్నారు. కాంగ్రెస్‌ ఎఐసిసి కార్యదర్శి హేయప్పన్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి ఎం చౌహాన్‌, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌, కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, గురునాథం తదితరులు తమ పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు. 10న ఉదయం గుంటూరులో సిపిఐ గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ విజయాన్ని కాంక్షిస్తూ జరిగే సభలో సీతారామ్‌ ఏచూరి ప్రసంగించనున్నారు.సిపిఎం అభ్యర్థుల ముమ్మర ప్రచారంఇండియా కూటమి తరపున పోటీచేస్తున్న సిపిఎం అసెంబ్లీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని గత కొద్దిరోజులుగా ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ప్రజానీకం నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రజలు గత పాలకుల వైఫల్యాలను నాయకుల వద్ద ప్రస్తావిస్తూ సమస్యలను వివరిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి సుత్తీ, కొడవలి, నక్షత్రం గుర్తుపై తమ అమూల్యమైన ఓట్లు వేసి తమను గెలిపించాలని సిపిఎం అభ్యర్థులు కోరుతున్నారు. తమను గెలిపిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని హామీఇస్తున్నారు. ఇండియా కూటమి బలపర్చిన రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి లోతా రామారావు, కురుపాం అభ్యర్థి ముండంగి రమణ, గాజువాక నుంచి మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్‌ నుంచి చిగురుపాటి బాబూరావు, గన్నవరం నుంచి కళ్ళం వెంకటేశ్వరరావు, మంగళగిరి నుంచి జన్నా శివశంకర్‌, నెల్లూరు సిటీ నుంచి మూలం రమేష్‌, పాణ్యం నుంచి డి.గౌస్‌దేశాయి, అరకు పార్లమెంట్‌ స్థానం నుంచి పాచిపెంట అప్పలనర్స అభ్యర్థులుగా తమ ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి సుత్తీ, కొడవలి,నక్షత్రం గుర్తుకే ఓట్లు వేయాలని కోరుతున్నారు. సిపిఎం ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీచేస్తున్నారు. వారికి మద్దతుగా ఇండియా కూటమి బలపర్చిన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు.
➡️