ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి

Apr 7,2024 22:20

ప్రజాశక్తి- సోమల (చిత్తూరు జిల్లా):ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా సదుం మండల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. సదుం మండలం చెరుకువారిపల్లికి చెందిన శరవణ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఆయన కుమారులు అభినాష్‌ (14) అశ్విన్‌ (13) ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిది, ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం సదుం నడిగడ్డ మార్గమధ్యంలోని రఘుపతి నాయన చెరువుకు వెళ్లారు. చెరువులో దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయారు. గమనించిన స్థానికులు వాళ్లను బయటకు తీశారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. ఎస్‌ఐ మారుతి పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

➡️