ప్రజాశక్తి వార్తకు స్పందించిన కలెక్టర్‌

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ప్రజాశక్తి వార్తకు కలెక్టర్‌ స్పందించారు. ప్రజాశక్తి పేపర్‌ లో ఈనెల 20వ తేదీన వచ్చిన వార్తతో మండల రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ గారపాటి వెంకటసుబ్బారావు స్పందనలు ఇచ్చిన వినతికి స్పందిస్తూ, జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు పశు వైద్యశాల చాగల్లు వెటర్నరీ అసిస్టెంట్‌ గా జి.నాగేంద్రబాబు ను నియమించారు. సోమవారం ఆయన విధులకు హాజరయ్యారు. పశు వైద్యుల డాక్టర్‌ యు.ముఖేష్‌ స్పందిస్తూ ప్రజాశక్తి లో ఈనెల 20 తేది వచ్చిన వార్తకు, కౌలు రైతుల కృషి వలన వెటర్నరీ అసిస్టెంట్‌ను నియమించినట్లు తెలిపారు.

➡️