కంటైనర్‌ను  ఢీకొట్టిన ఆయిల్‌ ట్యాంకర్‌ – డ్రైవర్‌ సజీవ దహనం

ప్రజాశక్తి-మేదరమెట్ల (బాపట్ల జిల్లా):కంటైనర్‌ను ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీకొనడంతో మంటలు వ్యాపించి.. డ్రైవర్‌ సజీవ దహనమయ్యారు. ఈ ఘటన బాపట్ల జిల్లా మేదరమెట్ల మండలంలోని బడ్డువానిపాలెం పైలాన్‌ వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. కృష్ణపట్నం పోర్టు నుంచి పేరిచెర్లలో ఉన్న జోసిల్‌ సోప్స్‌ కంపెనీకి ఆయిల్‌తో వెళుతున్న ట్యాంకర్‌ బొడ్డువానిపాలెం పైలాన్‌ వద్ద ఆగి ఉన్న కంటైనర్‌ను వేగంగా ఢీకొట్టింది. దీంతో ట్యాంకర్‌ క్యాబిన్‌లో మంటలు వ్యాపించాయి. క్షణాల్లో మంటలు లారీ మొత్తం వ్యాపించడంతో డ్రైవర్‌, ఓనర్‌ పొట్లూరి శ్రీధర్‌(40) బయటకు రాలేక అందులో చిక్కుకుపోయారు. అగ్నికీలలకు సజీవ దహనమయ్యారు. మృతుడు నెల్లూరు జిల్లా, కొవ్వూరు మండలం, ఈడుమడుగు గ్రామవాసిగా పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️