చిన్నారి ప్రాణం తీసిన పెన్‌

Jul 3,2024 13:20 #child died

హైదరాబాద్: పెన్‌..ఓ చిన్నారి ప్రాణం తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో ఈ విషాద-ం చోటుచేసుకుంది. పెన్‌ గుచ్చుకుని      సుభాష్‌ నగర్‌ కాలనీకి చెందిన చిన్నారి రియాన్షిక చికిత్స పొందుతూ చనిపోయింది. ఆడుకుంటుండగా రయాన్షిక చెవి పై- భాగం లోపలికి పెన్‌ చొచ్చుకుపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో తల్లిదండ్రులు ఖమ్మంలోని ఓప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. సర్జరీ అనంతరం బ్రెయిన్‌ కు ఇన్‌ పెక్షన్‌ కావడంతో చిన్నారి రియాన్షిక ప్రాణాలొదిలింది. రియాన్షిక చనిపోవడంతో తల్లిద-ండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

➡️