విశాఖ రైల్వే స్టేషన్‌లో వ్యక్తి హల్‌చల్‌

Jan 12,2024 11:05 #person, #railway station, #Visakha

విశాఖ : విశాఖ రైల్వే స్టేషన్‌లో మతిస్థిమితం లేని వ్యక్తి హల్‌చల్‌ చేశాడు. ఆ వ్యక్తి పిచ్చిచేష్టలకు ప్రయాణికులతోపాటు ఆర్పీఎఫ్‌, జీఆర్పీ పోలీసులకు ముచ్చెమటలుపట్టాయి. రూఫ్‌టాప్‌ పైకి ఎక్కి విద్యుత్‌ తీగలను పట్టుకుంటానని బెదిరించాడు. అతడిని సురక్షితంగా కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు నానాతంటాలుపడ్డారు. ముందుగా విద్యుత్‌ సరఫరా ఆపేసి ఆ వ్యక్తికి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా.. నాలుగో నంబర్‌ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ రైలుపైకి దూకాడు. దీంతో అతడి వెంట పోలీసులు పరుగులెత్తారు. ఎట్టకేలకు ప్రయాణికుల సాయంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా కిందకు దిపి ఆస్పత్రికి తరలించారు.

➡️