వడదెబ్బకు ఉపాధ్యాయురాలు మృతి

Apr 2,2024 00:36 #death, #sun stroke, #teacher

ప్రజాశక్తి – నందిగామ : వడదెబ్బ తగిలి ఓ ప్రయివేటు స్కూలు ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఎన్‌టిఆర్‌ జిల్లా నందిగామ శ్రీ చైతన్య పాఠశాలల ఉపాధ్యాయురాలుగా స్వరూపరాణి (40) పనిచేస్తున్నారు. నూతన విద్యార్ధుల అడ్మిషన్ల కోసం సోమవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఈ క్రమంలో ఎండ తీవ్రతకు తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు. గమనించిన తోటి ఉపాధ్యాయులు హుటాహుటిన ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆమెకు భర్త, ఇద్దరు కుమార్తెలున్నారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షలు చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేసింది.

➡️