మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

Jan 9,2024 11:30 #Crimes, #hyderabad

మొయినాబాద్‌ : చేవెళ్ల నియోజకవర్గంలోని మొయినాబాద్‌ మండలంలో దారుణం జరిగింది. మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. కొందరు దుండగులు చేసిన భాకరం గ్రామ పరిధిలోని ‘గ్రీన్‌ వ్యాలు’ రిసార్ట్‌ వెళ్లే దారిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు మహిళను వేరే చోట హత్య చేసి భాకరం గ్రామానికి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి వయసు 20-25 ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️