”ద వైఎస్‌ఆర్‌ ఫ్యామిలీ విషెస్‌ యూ” – చంద్రబాబు కుటుంబానికి షర్మిల క్రిస్మస్‌ కానుక

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యులకు సిఎం జగన్‌ సోదరి, వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల క్రిస్మస్‌ కానుకను పంపించారు. దీంతో పాటు ”ద వైఎస్‌ఆర్‌ ఫ్యామిలీ విషెస్‌ యూ… అంటూ … వైఎస్‌ కుటుంబం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. ఏ డిలైట్‌ఫుల్‌ క్రిస్మస్‌ అండ్‌ ఏ బ్లెస్డ్‌ 2024” అని రాసి ఉన్న గ్రీటింగ్‌ కార్డునూ పంపారు. ఈ విషయాన్ని ఆదివారం ఎక్స్‌ వేదికగా టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పంచుకున్నారు. షర్మిలకు ధన్యవాదాలు తెలియజేశారు. ”అద్భుతమైన కానుకలు పంపినందుకు మీకు హఅదయపూర్వక ధన్యవాదాలు. నారా కుటుంబం తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్‌, నూతన సంవత్సర శుభాకాంక్షలు” అని ట్వీట్‌ చేశారు. షర్మిల పంపిన గ్రీటింగ్‌, గిఫ్ట్‌ బాక్స్‌ల చిత్రాలను ట్వీట్‌కు జత చేశారు.

➡️