గుత్తిలో ఆరు దుకాణాల్లో చోరీ

Dec 7,2023 10:24 #Crimes in AP
theft in gutti

మరో మూడు దుకాణాల్లో చోరీ విఫలయత్నం
ప్రజాశక్తి-గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గుంతకల్లు రోడ్డులో ఉన్న ఆరు దుకాణాల్లో బుధవారం రాత్రి చోరీ జరిగింది. మరో మూడు దుకాణాల్లో దొంగలు చోరీకి యత్నించారు. దుకాణాలకు ఉన్న షట్టర్లను పగలగొట్టి గుర్తుతెలియని దుండగులు లోనికి ప్రవేశించారు. నంద గోపాల్ కిరాణా దుకాణంలో రూ.8వేలు, మధుసూధన్ కిరాణాదుకాణంలో రూ.5వేలు, విష్ణు వర్థన్ రెడ్డి, బ్రాహ్మిణి డయగ్నాస్టిక్ సెంటర్,దాదు మందుల దుకాణం, బాషా కిరాణా దుకాణల్లో నగదుతో పాటు విలువైన వస్తువులను చోరీ చేసుకుని వెళ్లారు. ప్రకాష్ అంగడి, సర్వేశ్వర రెడ్డి,గోపాల్ రెడ్డి ఫర్టిలైజర్ దుకాణాల్లో చోరీకి యత్నించారు. పట్టణంలో వరస చోరీలతో ప్రజల బెంబేలెత్తుతున్నారు. గుంతకల్లు రోడ్డులో ఇటీవల 8 దుకాణాల్లో చోరీ జరిగిన ఘటన మరవక ముందే దుండగులు మరోసారి చోరీలకు పాల్పడడం పట్ల దుకాణదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి చోరీలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఘటన స్థలాన్ని సిఐ ఎం.వెంకటరామిరెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

➡️