హైదరాబాద్‌లో 3 రోజులపాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుల్లేవు..!

తెలంగాణ : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన, ప్రారంభోత్సవాలు ఉండటంతో.. హైదరాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రోజులపాటు సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 8, 9, 10 తేదీల్లో సెలవులను రద్దు చేస్తూ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజుల్లో కార్యాలయాలను యథావిధిగా నడపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేడు హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు.

➡️