హజ్‌ యాత్రకు మూడు ప్రత్యేక విమానాలు

May 22,2024 09:22 #Hajj, #Three special flights

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నెల 27వ తేదీ మొదటి విమానం, 28వ తేదీ రెండవ విమానం, 29వ తేదీ మూడవ విమానం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి సౌదీ అరేబియాలోని జెడ్డా విమానాశ్రయానికి చేరుకుంటాయని తెలిపింది. సదరు యాత్రికులకు వారి ప్రయాణ వివరాలను, హజ్‌ క్యాంప్‌నకు రిపోర్టింగ్‌ చేయు సమయాలను వాట్సాప్‌ ద్వారా పంపినట్లు పేర్కొంది. హజ్‌ క్యాంప్‌ను గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలోని ఈద్గా జామ మసీదులో ఏర్పాటు చేశామని తెలిపింది. అలాగే యాత్రికుల సౌకర్యార్థం 1800-4257873 టోల్‌ ఫ్రీ నెంబరు కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

➡️