రేపు నయవంచన పుస్తకావిష్కరణ

Apr 24,2024 13:25 #book, #released, #Vijayawada

ప్రజాశక్తి-విజయవాడ: పది సంవత్సరాల నిరంకుశ పాలన, 10 దారుణ మోసాలపై ఆంధ్ర ప్రదేశ్‌ పౌర సంఘాలు ప్రచురించిన నయవంచన పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం ఉదయం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరగుతోంది. ఈ పుస్తకాన్ని రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆవిష్కరిస్తారు. గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ కె.ఎస్‌ లక్ష్మణరావు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక కో కన్వీనర్‌ కె.విజయరావు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

➡️