రేపటి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్‌

Apr 11,2024 16:45 #'Memanta Siddam, #Bus Trip, #schedule

పల్నాడు జిల్లా: ‘మేమంతా సిద్ధం’ 13వ రోజు శుక్రవారం (ఏప్రిల్‌ 12) షెడ్యూల్‌ను వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం గురువారం విడుదల చేశారు. ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల రాత్రి బస నుంచి బయలుదేరుతారు. సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్‌, నల్లపాడు మీదుగా హౌసింగ్‌ బోర్డు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు.
అనంతరం చుట్టుగుంట సర్కిల్‌, వీఐపీ రోడ్‌ మీదుగా సాయంత్రం 3.30 గంటలకు ఏటుకూరు బైపాస్‌ సభ ప్రాంగణంకు చేరుకుని బహిరంగ సభలో పాల్గని ప్రసంగిస్తారు. సభ అనంతరం తక్కెలపాడు బైపాస్‌, పెదకాకాని బైపాస్‌, వెంగళ్‌ రావు నగర్‌, నంబూరు క్రాస్‌ మీదుగా నంబూరు బైపాస్‌ దగ్గర రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.

➡️