ద్విచక్ర వాహనాన్ని ఢీ కొన్న లారీ – ఇద్దరు పాస్టర్లు మృతి

Apr 7,2024 21:01 #2 death, #Fatal road accident

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఇద్దరు పాస్టర్లు దుర్మరణం చెందారు. ఈ సంఘటన పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వీరవట్నం సమీపంలోని అద్దంకి – నార్కెట్‌పల్లి రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈపూరు మండలం గోపువారిపాలేనికి చెందిన పాస్టర్లు రావెల వెంకటేశ్వర్లు (75), మొండితోక బాలశౌరి (53) రొంపిచర్ల మండలం తురుమెళ్లలోని చర్చి ప్రార్థనలో పాల్గనేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వీరవట్నం వద్ద వీరి ద్విచక్ర వాహనాన్ని ఒంగోలు నుండి హైదరాబాద్‌ వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ఢకొీట్టింది. ద్విచక్ర వాహనం నడుపుతున్న బాలశౌరి లారీ క్రింద పడి అక్కడికక్కడే మఅతి చెందగా.. తీవ్ర గాయాలపాలైన వెంకటేశ్వర్లును నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రొంపిచర్ల ఎస్‌ఐ కెపి రవీంద్రబాబు తెలిపారు.

➡️