ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తాం

-ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ : మంత్రి డి.బాలవీరాంజనేయస్వామి
ప్రజాశక్తి-టంగుటూరు (ప్రకాశం జిల్లా) :ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లను కొనసాగిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, సచివాలయాలు, వలంటీర్ల శాఖ మంత్రి డి.బాలవీరాంజనేయస్వామి తెలిపారు. వైసిపి నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని, మా జీవితాలతో ఆడుకున్నారని వలంటీర్లు తన ఫోన్‌కు వాట్సప్‌ మెసేజ్‌లు పంపించారని, ఇలాంటి మెసేజ్‌లతో తన వాట్సప్‌ అంతా నిండిపోయిందని చెప్పారు. మంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు వచ్చిన ఆయన తన నియోజకవర్గ పరిధిలోని ప్రకాశం జిల్లా టంగుటూరు మండల పరిధిలోని వల్లూరమ్మ తల్లి దేవాలయములో ఆదివారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వలంటీర్లతో ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పారు. వచ్చే ఒకటో తేదీన పింఛనుదారులకు రూ.7 వేలను వారి ఇంటి వద్దే అందిస్తామన్నారు. అభివృద్ధికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం సమహొ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు,హొరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలో శ్వేత పత్రం విడుదల చేస్తామన్నారు. త్వరలో పలు కీలక బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు.

➡️