అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి

ప్రజాశక్తి-అమరావతి : అనకాపల్లి లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడి పేరును వైసిపి ప్రకటించింది. బూడి ముత్యాల నాయుడు కొప్పుల వెలమ సామాజిక వర్గం. ప్రస్తుతం మాడుగుల సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా మాడుగుల స్థానానికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈర్లి అనురాధను ఎంపిక చేశారు. అనురాధ బూడి ముత్యాలనాయుడు కుమార్తె.

➡️