బీసీ కులగణన పేరిట వైసిపి భారీ మోసం: కొల్లు రవీంద్ర

Nov 23,2023 14:48 #kollu raveendra, #press meet

అమరావతి: బీసీ కులగణన పేరిట వైసిపి ప్రభుత్వం భారీ మోసానికి తెరలేపిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్లాక్‌మెయిల్‌ చేసి బీసీలకు అందే లబ్ధి తొలగించేందుకు కుట్ర పన్నారన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు.ప్రైవేటు సంస్థలకు బీసీల సమాచారమిచ్చి వాళ్ల బతుకులు తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. మోసపూరిత రాజకీయాలతో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. అందులోని ప్రయత్నమే వైసిపి సామాజిక బస్సు యాత్రలని దుయ్యబట్టారు. సామాజిక వర్గాల బతుకులు బుగ్గి చేసి సామాజిక యాత్రలు చేయడానికి సిగ్గు ఉండాలని మడ్డిపడ్డారు. బీసీలను బానిసలుగా సీఎం జగన్‌ దిగజార్చారని విమర్శించారు. వైసిపి బీసీల పోరాట కార్యాచరణ త్వరలోనే ప్రకటిస్తామని కొల్లురవీంద్ర తెలిపారు.

➡️