తొందరపడి మాట్లాడితే నష్టపోయేది మీరే : మాజీ ఎంపి

Jan 19,2024 15:30 #ex mp, #press meet

తెలంగాణ: కేటీఆర్‌ మాట్లాడిన తీరు బాగాలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి దావోస్‌ పోవడం తెలంగాణ కోసమే వెళ్ళారని తెలిపారు. మిమ్మల్ని అనేక రకాలుగా తిట్టిన వాళ్ళను మీ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చారని మండ్డిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఒక్క పని చేయలేదన్నారు. పదేళ్లు మీరు రాష్ట్రాన్ని పాలించారు. పది రోజులు కూడా ఓపిక పెట్టకపోతే ఎలా? అన్నారు. మేము అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్‌ సౌకర్యాలు ఇచ్చామన్నారు. ధరణి కమిటీ వేశామని, అనేక పనులు జరుగుతున్నాయని తెలిపారు. తొందరపడి పడి మాట్లాడితే మీరు ఇంకా నష్టపోతారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడండని అన్నారు. మీ ప్రకటన వల్ల మీరే ఇంకా దిగజరిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అభివఅద్ది కోసం దావోస్‌ వెళ్లిన సీఎంపై కామెంట్లు చేయడం హాస్యంగా ఉందని అన్నారు. కేటీఆర్‌ చదువుకున్న వాడే అన్నారు. మేము అన్నీ చేస్తాం అని అన్నారు. మీ మాటలను ఎవరూ నమ్మరని తెలిపారు. ప్రజలకంటే ముందే మీ లల్లి ఏంది? అని ప్రశ్నించారు. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని తెలిపారు. పనిపాటలేక మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఇక మాజీ సీఎం ఫౌమ్‌హౌస్‌ లో వుండిపోయారని, ఎప్పుడు బయటకు వస్తారో తెలియదని అన్నారు. ఇక మిగిలిన వారు మాత్రం మాపై బురుదల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ లో కాంగ్రెస్‌ గల్లంతు అవుతుందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మేము కాము గల్లంతు మీరే అవుతారని వీహెచ్‌ మండపడ్డారు. అయితే.. కాంగ్రెస్‌ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు కాదు. మొత్తం లెక్క తెస్తే 420 హామీలు ఇచ్చారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ చీఫ్‌ గా ఉండి, అధికారంలోకి వచ్చాక డిసెంబర్‌ 9 నాడు రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణం తెచ్చుకోండి అన్నారని గుర్తు చేశారు. అందుకే 420 హామీలను చేసేదాకా విడిచి పెట్టమని కేటీఆర్‌ అన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల అసలు రంగు బయట పడుతుందని అన్నారు.

➡️