‘వైఎస్‌ఆర్‌ ఉచిత విద్యుత్‌’ పేరు మార్పు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. వైఎస్‌ఆర్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంగా ఉన్న పేరును ఆంధ్రప్రదేశ్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకంగా మారుస్తూ ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి కె విజయానంద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అసంఘటిత కార్మికులకు అమలు చేస్తున్న వైఎస్‌ఆర్‌ బీమా పథకాన్ని చంద్రన్న బీమాగా మారుస్తూ కార్మికశాఖ కార్యదర్శి హరి జవహర్‌లాల్‌ జిఓ 344ను విడుదల చేశారు.

➡️