చేయి చూపించుకోవాలని ఆస్పత్రికెళ్లాడు.. డాక్టర్లు అవాక్కయ్యారు..!

Jan 27,2024 13:39 #Doctors, #hands, #hospital, #surprise

బ్రెజిల్‌ : ఓ యువకుడి నెత్తిపై ఏదో రాయి పడ్డట్టు అనిపించింది… బ్లడ్‌ వస్తే తోటి స్నేహితులు ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు.. 4 రోజులు ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపాడు.. ఉన్నట్టుండి చేయి స్పర్శ కోల్పోయింది.. డాక్టర్‌ దగ్గరికి వెళ్లి చూపిస్తే.. స్కాన్‌లో విషయాన్ని చూసి వైద్యులే విస్తుపోయారు..! ఇన్నాళ్ల సర్వీసులో ఇలాంటిది చూడలేదన్నారు..!

ఏమైందంటే … బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల మాటియస్‌ ఫాసియో అనే యువకుడు స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నాడు. ఇంతలో … అతడికి.. ఒక్కసారిగా తలపై ఏదో పడినట్టు అనిపించింది. రక్తం వస్తుండటంతో.. స్నేహితులు ఆతడికి వెంటనే ఫస్ట్‌ ఎయిడ్‌ చేసి.. కట్టుకట్టారు. అందరూ కూడా మాటియస్‌పైకి ఎవరో రాయి విసిరి ఉండొచ్చునని అనుకున్నారు. ఆ తర్వాత నాలుగు రోజులు స్నేహితులతో ఫుల్‌గా పార్టీ ఎంజారు చేశారు. అయితే యువకుడి తలపై రాయిపడలేదు.. బుల్లెట్‌ దిగింది. ఆ బుల్లెట్‌ 4 రోజులుగా ఆ యువకుడి తలలో ఉంది. కానీ ఎలాంటి సమస్యా కలగలేదు. ఓ రోజు ఆ యువకుడు కారులో వెళుతుండగా, అతడి చేయి స్పర్శ కోల్పోయినట్టు అనిపించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు సదరు బాధితుడి తలను ఎక్స్‌రే తీసి చూడగా.. బుల్లెట్‌ ఉండటం చూసి దెబ్బకు షాక్‌ అయ్యారు. అనంతరం రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి.. అతికష్టం మీద ఆ బుల్లెట్‌ను బయటకు తీశారు. అది 9ఎంఎం బుల్లెట్‌గా గుర్తించారు డాక్టర్లు. తమ సర్వీసు హిస్టరీలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని.. ఆపరేషన్‌ అయిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించామని డాక్టర్లు చెప్పారు. ఆ బుల్లెట్‌ ను డాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

➡️