పైసా ఖర్చు లేకుండా టీ తాగిన ఇద్దరు చిచ్చర పిడుగులు

Feb 20,2024 16:01 #trending twitter

ఇంటర్నెట్‌డెస్క్‌ : పైసా ఖర్చు లేకుండా.. ఇద్దరు చిన్నారులు ఎంతో తెలివిగా టీ తాగారు. వాళ్ల తెలివిని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఓ చిన్నారి ఎటిఎం దగ్గరకు వెళ్లి కార్డు పెట్టి.. డబ్బులు తీసుకోకుండా.. కేవలం రిసిప్ట్స్‌ తీసుకుని బయటకు వచ్చాడు. ఆ రిసిప్ట్స్‌ని అమ్మి వచ్చిన డబ్బులతో ఆ ఇద్దరు చిన్నారులు టీ తాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన ఓ నెటిజన్‌ ‘ఎటిఎం కార్డు దండగ.. అక్కడ ఉండే డస్ట్‌బిన్‌లో రిసిప్ట్స్‌ సరిపోతాయిగా..’ అంటూ కామెంట్‌ చేశారు. మరో నెటిజన్‌ రోజులో ఎక్కువసార్లు ఎటిఎం కార్డును ఉపయోగించకూడదు. అంటూ వ్యాఖ్యానించారు.

➡️