గాంధీనగర్ : వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత సి.జె. చావ్దా శుక్రవారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన ఉదయం గాంధీనగర్‌లో స్పీకర్ శంకర్ చౌదరికి తన రాజీనామాను సమర్పించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీల బలం 15కి పడిపోయింది.
2002లో గాంధీనగర్ నియోజకవర్గం నుండి మొదటిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2012లో గాంథీనగర్ నార్త్ నుండి ఎన్నికయ్యారు. 2022 వరకు ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. 2022 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో విజాపూర్ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థి రమణ్భారు పటేల్‌ను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 182 మంది సభ్యులు కలిగిన గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికైన 17 మంది కాంగ్రెస్ సభ్యుల్లో ఈయన కూడా ఒకరు. గతంలో మరో ఎమ్మెల్యే చిరాగ్ పటేల్ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి రాజీనామాలతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 15కి పడిపోయింది.