నిద్రపోయే ముందు లెమన్‌ వాటర్‌ తాగితే బరువు తగ్గుతారా?!

Feb 15,2024 12:59 #health

ఇంటర్నెట్‌డెస్క్‌ : అధిక బరువు ఉన్నవారు.. బరువు తగ్గడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడానికి కొంతమంది ఆహారం మానేస్తారు. మరికొంతమంది ఫ్రూట్స్‌, పానీయాల్ని తీసుకుంటూ బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తారు. నిద్రపోయేముందు లెమన్‌ వాటర్‌ తాగితే సులువుగా బరువు తగ్గుతారు అని తాజాగా సోషల్‌మీడియాలో ఓ వీడియో వైరల్‌ అవుతుంది.

ఒక గ్లాసు వేడి నీటిలో లెమన్‌ జ్యూస్‌, కొద్దిగా అల్లం రసం, రెండు మూడు లవంగాలు వేసుకుని నిద్రపోయే ముందు తాగితే బరువు తగ్గుతారు అని సోషల్‌మీడియాలో వీడియో వైరల్‌ అవుతుంది. అయితే ఈ నీటిని రోజూ తాగితే బరువు తగ్గుతారు అని కచ్చితంగా చెప్పలేమని వైద్యులు సూచిస్తున్నారు. నిమ్మరసం, అల్లం రసం, లవంగాలు వంటి పదార్థాలన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటితో చేసిన నీటిని తీసుకుంటే అధిక బరువు కాకపోయినా.. తక్కువ బరువు తగ్గవచ్చు. ఈ నీరు అందరికి సరిపడుతుందని చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఈ నీటిని తీసుకుంటే కొందరికి వికారము, వాంతులు కూడా అవ్వొచ్చు. మీరు ఈ నీటిని ఒకసారి తాగిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటే.. ఈ నీటిని తీసుకోవచ్చు అని వైద్యులు సూచిస్తున్నారు.

➡️