అమెజాన్‌లో ఉత్పత్తులు ప్రియం

Mar 23,2024 21:30 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ ఇ-కామర్స్‌ వేదిక అమెజాన్‌లో పలు ఉత్పత్తులు ప్రియం కానున్నాయి. అమెజాన్‌లోని విక్రేతలపై రుసుంను పెంచడమే ఇందుకు కారణం. ఏప్రిల్‌ 7వ తేదీ నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని అమెజాన్‌ పేర్కొంది. ఇంటి అలంకరణ ఉత్పత్తులపై 9 శాతం ఉన్న విక్రేతల ఫీజును 13.5 శాతానికి చేర్చింది. లగ్జరీ బ్యూటీ ఐటమ్స్‌పై 5 శాతంగా ఉన్న ఛార్జ్‌ను 10 శాతానికి పెంచింది. స్లీప్‌వేర్‌ కేటగిరీలోని ప్రొడక్ట్స్‌కు సంబంధించిన విక్రయ రుసుంను 11 శాతం నుంచి 19 శాతానికి చేర్చింది. నిర్వహణ వ్యయాలు, వడ్డీ రేట్‌లు, ద్రవ్యోల్బణం. తదితర వాటిని దృష్టిలో ఉంచుకుని ఫీజులు పెంచాల్సి వచ్చిందని ఆ సంస్థ పేర్కొంది.

➡️